Monday, October 6, 2025
E-PAPER
Homeజిల్లాలుభారీ వర్షానికి కోతకు గురైన దోస్తుపల్లి రోడ్డు

భారీ వర్షానికి కోతకు గురైన దోస్తుపల్లి రోడ్డు

- Advertisement -

– రాకపోకలకు తీవ్ర అంతరాయం..
నవతెలంగాణ – జుక్కల్ 

మండల పిరధిలోని దోస్తుపల్లిలో ఆదివారం రాత్రి కురిసిన భారి వర్షానికి నూతనంగా వేసిన బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ గ్రామానికి రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్డు ఆవలి వైపు దోస్తుపల్లి గ్రామంతో పాటు బంగారు పల్లీ,  డోన్గావ్, సోపూర్ , శక్తి నగర్ ,  మత్తురాతాండ గ్రామాల ప్రజలు జుక్కల్ మండల కేంద్రానికి రావాలంటే ప్రయాణం అతి కష్టంగా మారింది. రోడ్డు పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఇంకా పనులు పూర్తికాక పోవడంతో సమస్య మొదటికే వచ్చి చేరింది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు రెండు వరుసల బీటి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -