Thursday, May 29, 2025
Homeజాతీయంమళ్ళీ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు

మళ్ళీ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: నగరవాసులకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు విశాఖపట్నం రహదారులపై డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే పరుగులు తీయనున్నాయి. మొత్తం మూడు డబుల్ డెక్కర్ బస్సులను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నగరానికి తీసుకురానున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులను ప్రధానంగా నగరంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలైన సింహాచలం, కైలాసగిరి, తొట్లకొండ వంటి మార్గాల్లో నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారు. దీనివల్ల నగర పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. జూన్ 10 నాటికి కనీసం ఒక బస్సునైనా సిద్ధం చేసి, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించాలని జీవీఎంసీ ఇంఛార్జి కమిషనర్‌ హరేంధిరప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -