– 22 నుంచి అమల్లోకి : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశ ప్రగతికి, అభివృద్ధికి జీఎస్టీ 2.0 డబుల్ డోస్ వంటిదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో భారతదేశ పురోగతికి మద్దతుగా తదుపరి తరం సంస్కరణలను తీసుకువచ్చామన్నారు. గురువారం జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన చర్యలను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించిన మరుసటి రోజే ప్రధాని వ్యాఖ్యలు వెలువడ్డాయి. జీఎస్టీ సంస్కరణల ద్వారా భారతదేశ చురుకైన ఆర్ధిక వ్యవస్థకు ఐదు కొత్త పంచరత్నాలను జత చేసినట్లు చెప్పారు. జీఎస్టీ మరింత సులభమైందన్నారు. నవరాత్రి మొదటి రోజు నుంచి కొత్తరేట్లు అమల్లోకి వస్తాయన్నారు. సకాలంలో తీసుకోవాల్సిన చర్యలు, మార్పులు చేపట్టకపోతే, మనం ఈనాటి అంతర్జాతీయ పరిస్థితుల్లో మన దేశానికి సరైన దిశా నిర్దేశాన్ని చేయలేమని మోడీ పేర్కొన్నారు. భారత్‌ను స్వయం స్వావలంబనగా తీర్చిదిద్దాలంటే కొత్త తరం సంస్కరణలు చేపట్టక తప్పదని, ఇవి అత్యంత కీలకమని స్వాతంత్య్ర దినోత్సవం నాడు చెప్పామని, దీపావళి, ఛాత్‌పూజలకు ముందుగానే ఈసారి డబుల్ ధమాకా అందుతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రోజువారీ అవసరమైన వస్తువులపై కూడా భారీగా పన్నులు పడేవన్నారు. సామాన్యుడికి సంతోషం కలిగేలా ఆ సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పుకున్నారు.
దేశ ప్రగతికి డబుల్ డోస్ జీఎస్టీ 2.0
- Advertisement -
- Advertisement -