స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొచ్చే వారితో సర్దుబాటు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీల రిజర్వేషన్ల విషయంలో కొందరు డబుల్ డ్రామాలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో మీడియా సమావేశం లో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి నర్సింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్‌తో కలిసి కూనంనేని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్, సీపీఐ(ఎం), వామపక్ష పార్టీలతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ నెల 8న వెలువడనున్న కోర్టు తీర్పు ఆధారంగా, ఆ కేసులో సీపీఐ కూడా ఇప్లిండ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు చెల్లుబాటు అవుతాయా? లేదా? అనే చర్చలు జరుగుతున్నాయనీ, ఇటీవల శాసనసభలో ఆ బిల్లులకు అన్ని రాజకీయ పార్టీలు అమోదం తెలిపాయని గుర్తుచేశారు.
ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్లను పెంచడంతో రిజర్వేషన్లపైన ఉన్న 50 శాతం పరిమితి ఎప్పుడో దాటిందని తెలిపారు. రాష్ట్రంలో బలమైన జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ స్థానాలను గుర్తించి పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన సామాజిక కార్యకర్త వాంగ్‌చుక్‌ను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తున్నదని విమర్శించారు. దేశ ప్రజలను అవమానించే విధంగా వ్యవహారిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్ల ప్రధాని మోడీ పల్లెత్తు మాట కూడా అనడం లేదని విమర్శించారు.
బీసీల రిజర్వేషన్లపై డబుల్ డ్రామాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES