అగ్రకథానాయకుడు ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు మేకర్స్ డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.
ఫౌజీ..
ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపొందుతున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కి ‘ఫౌజీ’ అనే పవర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ చిత్ర టైటిల్‌పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘ఫౌజీ’ టైటిల్ ప్రభాస్ సైనికుడి పాత్రను సూచిస్తుంది. 1940 నేపథ్యంలో సాగే ఈ కథలో కాలిపోయిన బ్రిటీష్ జెండా తిరుగుబాటుకు సంకేతంగా కనిపిస్తోంది. అగ్నిజ్వాలలు, సంస్కత శ్లోకాలు, కోడ్ లాంటి చిహ్నాలు ఈ కథలోని మైథలాజికల్, హిస్టారికల్ అంశాలను సూచిస్తున్నాయి. మహాభారతంలోని కర్ణుడి ప్రతిరూపంగా హీరోను చూపించే తీరు అద్భుతం. హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు చేస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
రాజా సాబ్..
ప్రభాస్, డైరెక్టర్ మారుతి కలయికలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాజా సాబ్’. కలర్ ఫుల్ పోస్టర్‌తో ప్రభాస్‌కు మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. మేళతాళాలతో ప్రభాస్‌ను ఊరి ప్రజలు ఆహ్వానిస్తున్న స్టిల్‌తో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో ప్రత్యేకమైన స్వాగ్, స్టైల్‌లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమా కోసం క్రేజీ సాంగ్స్ కంపోజ్ చేశారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హర్రర్, కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు న్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి హ్యూజ్ రెస్పాన్స్ లభించింది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
డబుల్ సర్‌ప్రైజ్..
- Advertisement -
- Advertisement -



