Thursday, October 2, 2025
E-PAPER
Homeజాతీయం14 శాతం పెరిగిన వరకట్న కేసులు

14 శాతం పెరిగిన వరకట్న కేసులు

- Advertisement -

టాప్‌ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్‌ :ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడి
అంతకుముందు సంవత్సరాల కంటే.. 2023 లో దేశవ్యాప్తంగా వరకట్నం కేసులు 14 శాతం పెరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2023లో దేశవ్యాప్తంగా 15 వేల వరకట్నం కేసులు నమోదయ్యాయి. ఈ వేధిం పులకు 6,100 మంది మహిళలు బలైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. 2023లో వరకట్న నిషేధ చట్టం కింద 15,489 కేసులు నమోద య్యాయని ఎన్సీఆర్బీ క్రైమ్‌ ఇన్‌ ఇండియా 2023 నివేదిక పేర్కొంది. 2022లో 13,479, 2021లో 13,568 ఈ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2021 – 2022 కంటే 2023లో 14 శాతం వరకట్న కేసులు పెరిగాయని ఎన్సీఆర్బీ నివేదిక స్పష్టం చేసింది.రాష్ట్రాల వారీగా చూస్తే.. వరకట్నపు కేసుల్లో ఉత్తరప్రదేశ్‌ టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఆ రాష్ట్రంలో వరకట్న నిషేధ చట్టం కింద 7,151 కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత బీహార్‌ 3,665, కర్నాటక 2,322 కేసులతో వరుస స్థానాల్లో నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌, గోవా, అరుణాచల్‌ ప్రదేశ్‌, లడక్‌, సిక్కిం సహా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వరకట్న కేసులు నమోదవ్వకపోవడం గమనార్హం.వరకట్న వేధింపులకు సంబంధించిన మరణాల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 2,122, బీహార్‌లో 1,143 వరకట్న మరణాలు నమోదయ్యాయి. 2023లో దేశవ్యాప్తంగా 833 హత్య కేసుల్లో వరకట్నమే ప్రధానకారణంగా నమోదైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. ఇక వరకట్న నిషేధ చట్టం కింద 2023లో 83,327 కేసులు కోర్టు ముందు విచారణకు వచ్చాయి. వీటిల్లో 69,434 కేసులు అంతకుముందు సంవత్సరాల కంటే.. వేగవంతంగా కోర్టు విచారణకు వచ్చాయి. ఈ చట్టం కింద 2023లో 27,154 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 22,316 మంది పురుషులు, 4,838 మహిళలు ఉన్నారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -