Thursday, April 2, 2026
E-PAPER
Homeక్రైమ్కట్నం వేధింపులు..నెల రోజులకే నవవధువు ఆత్మహత్య

కట్నం వేధింపులు..నెల రోజులకే నవవధువు ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లినా, కట్నం వేధింపులు విషాదాంతానికి దారితీశాయి. బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఐదేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో ఫిబ్రవరి 10న పెద్దలను ఒప్పించి పట్నాలో వివాహం చేసుకున్నారు. జాబ్ కోసం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివసిస్తున్నారు. అయితే అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఇషిక, పెళ్లైన 50 రోజులకే ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -