నవతెలంగాణ – జుక్కల్
99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా డివిజనల్ పంచాయతీ అధికారి ప్రసాద్ జుక్కల్ మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ అస్పత్ వార్ అనీల్ కుమార్ తో కలిసి గ్రామంలోని డాగ్స్ కు వాక్సినేషన్ వేశారని ఎంపీఓ రాము తెలిపారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ పాలకవర్గం ఎంపీ ఓ రాము నర్సరీ విసిటింగ్ మరియు ఇందిరమ్మ ఇళ్లు మార్కౌట్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా డివిజనల్ పంచాయతీ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి చెందాలంటే ముందుగా సర్పంచులకు అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. గ్రామాభివృద్ధికి మూల వ్యక్తి సర్పంచ్ అని సర్పంచ్ తలుచుకుంటే గ్రామాన్ని సుందరవనంగా అభివృద్ధి చేయవచ్చు అని తెలిపారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ప్రసాద్ , ఎంపీ ఓ రాము, సర్పంచ్ అనిల్ కుమార్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పంచాయతీ కార్యదర్శి రమేష్ చారి, తదితరులు పాల్గొనడం జరిగింది.
పెద్ద ఏడ్గి 99 డేస్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీపీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



