యాడ్నో తుపాను పాడైంది ఒక్క తీర్ణ వాన జల్లు లు మూఢల్కే సలికాలం సాలి మిడి కెళ్ళి ఆనాలు దగ్గులు తుమ్ములు, పిలగండ్లకు పరిచల్లు షురూ అయినాయి మోకాళ్ళ కొంచం హైబాత్ కానొస్తుంది పరిచలు రాస్కుంటానే గాడి గాడి కి ముక్కు సిదానికే బైటికి పోతున్నారు. జాగ్దీష్ ‘టీచర్ ఇంటర్నెట్’, అనబోతే టీచర్ సప్పుడజేయాకు నికు ఇంటర్నెట్ తక్కువైయినది ,ఇంటర్ నెట్ యాడికి బోడు పరిచలు అయినాక ఒక దినం పర్సత్ గా అన్ని కుళ్ళ కుళ్ళ గా జెప్తా అని గద్మంచింది. నవ్వుకుంటా రాయుడు షురూ జేసిందట. గవన్ని గ్యాణం కే గాని సద్వాకు గూడ టైం ఇయ్యాలే గా ఎప్పుడూ దేనికి ఐలవ్ ఇయ్యల్ని గా దానికి ఇయ్యాలే , పెద్దోళ్ళేదో చెప్తారు గదా పెండ్లి ల సక్కగొట్టానికే పాటలు పాడతారు యుద్ధం ల కత్తి పట్కొని సెయ్యాలే గాని పాటలు పడుకుంటా కూసుంటారా, మొత్తానికి పిల్లలు రాస్తానేన్నారు.
తుల్సాకులు, మిర్యాలు, పాస్పు, అన్ని గుర్తు సేసి ఆడపిస్తున్న. పరిచలు అయినాక అన్ని పిల్లల్తా చేపించాలి మోడలకి పిల్లలికి తెలుసుకునాలనే ఆతత ఉంటే సాలు అన్ని నీరసుంటారు బెల్లం తీపి మరిగిన ఈగల్ని అంత తొల్నా ఆపజల్తామా? గి సిబ్రం కి వోచినప్పటి నుండి గడైతే పిల్లలకి కల్గింది మనం ఒక్క అడిగేస్తే ఆళ్ళు మూఢ అడుగులు ఆస్తున్స్డ్రు దేవుని దయ తోని ఆ అడుగులు ముందు ముందుకే పడాలే అప్పటికైనా మన దేశం బాగుపడానికే మన ఊరు పిల్లల గూడ ఆళ్ళ ఒంధుకు ఆళ్ళు జెయ్యాలే జేస్తారు లే వైశు పెరుగుతే తెలివి కూడా పెరుగుతది లే కాకుంటే తప్పు తోవ తొక్కకుండా ఒక కన్నీయాలె . పేమదాలన్నీ గన్నే షురూ ,ఇయాల తుల్సి ఉసిరి పూజ, కార్తీకం దీపాలు గూడ పెట్టలే పెద్ద పెద్ద మంత్రాలు మనకేం రావు గాని ,ఇంత అస్పు కుంకమా పెట్టి ఆర్థి గిట్ట ఇచ్చి అమ్మ సళ్ళనగా సుడు అని మొక్కితివంటే ఆమనే కాపడ్తది.
- గంగరాజ పద్మజ, 9247751121



