Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనేరాన్ని అంగీకరించిన డాక్టర్‌ నమ్రత!

నేరాన్ని అంగీకరించిన డాక్టర్‌ నమ్రత!

- Advertisement -

– సృష్టి ఫెర్టిలిటీ కేసులో కీలక పరిణామం
– కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి..
నవతెలంగాణ-సిటీబ్యూరో

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌ కేసులో కూపీ లాగితే డొంక కదులుతోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్‌ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి డాక్టర్‌ నమ్రత నేరం అంగీకరించినట్టు కన్ఫెషన్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అందులోని వివరాలిలా ఉన్నాయి.. నమ్రత విజయవాడ, సికింద్రాబాద్‌, విశాఖలో ఫెర్టిలిటీ సెంటర్లు నడిపారు. సరోగసి పేరుతో దంపతుల నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వసూలు చేశారు. ఏజెంట్లను నియమించుకొని పిల్లలను కొనుగోలు చేశారు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు డబ్బులు ఆశచూపి శిశువు విక్రయానికి ఒప్పందం చేసుకునేవారు. ప్రసవం తర్వాత బాలింతల నుంచి పిల్లలను కొనుగోలు చేశారు. అందుకు ఏజెంట్లకు రూ.3 నుంచి 5లక్షలు ఇచ్చేది. అయితే ఏజెంట్లు మాత్రం బాలింతలకు రూ.50 నుంచి లక్ష వరకు మాత్రమే ఇచ్చేవారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా నమ్మించారు. పలు పోలీసు స్టేషన్లలో తనపై కేసులు నమోదైనట్టు నమ్రత ఒప్పుకొన్నారు. మొదట మహా రాణిపేట పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైందని, ఆ తరువాత వైజాగ్‌ టూ టౌన్‌, గోపాలపురం పోలీస్‌ స్టేషన్లలో ఐదు కేసులు, గుంటూరు కొత్తపేటలో మరో కేసు నమోదైందని, 2020లో మహారాణిపేటలో నమోదైన కేసులో రిమాండ్‌కు వెళ్లి వచ్చానని నమ్రత అంగీకరించారు.
1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్‌ను స్థాపించిన నమ్రత.. 2007లో సికింద్రాబాద్‌లో రెండో బ్రాంచ్‌ను ప్రారంభించారని అంగీకరించారు. ఆ తర్వాత వైజాగ్‌లోనూ మరో ఫెర్టిలిటీ సెంటర్‌ను ప్రారంభించారు. నమ్రత రెండో కుమారుడు జయంతి కృష్ణ న్యాయవాదిగా ఉంటూ ఆమెకు సహకరించేవాడని కన్ఫెషన్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసేవారని తెలిసింది. పిల్లల్ని కొనుగోలు చేయడంలో సంజరుతోపాటు సంతోషి కీలకంగా వ్యవహరించారు. సికింద్రాబాద్‌ సెంటర్లో సూపర్‌వైజర్‌ కం ఫార్మసిస్ట్‌గా కృష్ణ, రిసెప్షనిస్ట్‌గా పద్మ, టెలికాలర్‌గా అర్చన, మేరీ, సోనా, నర్సుగా సురేఖ, ల్యాబ్‌ టెక్నీషియన్‌గా ప్రభాకర్‌ ఉన్నారు. వైజాగ్‌ సెంటర్లో మేనేజర్‌గా కళ్యాణి, ల్యాబ్‌ టెక్నీషి యన్‌గా రమ్య ఉన్నారు. విజయ వాడలో డాక్టర్‌ మధులత, డా. కిషోర్‌ బాబు, డా.కరుణ కీలకంగా వ్యవహరి ంచారని నమ్రత అంగీకరించింది.

ప్రశ్నిస్తే బెదిరించేవారు
పిల్లలు కావాలనుకునే దంపతులను నమ్రత మచ్చిక చేసుకునేవారు. వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని లక్షలు వసూలు చేశారు. కొనుగోలు చేసిన పిల్లలను సరోగసి ద్వారా పుట్టిన వారిగా దంపతులను నమ్మించేవారు. డబ్బులు తక్కువ ఇచ్చారంటూ బాలింతలు ప్రశ్నించినా, ఇటు డీఎన్‌ఏ ద్వారా నిజం తెలుసుకున్న దంపతులు ఎవరైనా గుర్తించి ప్రశ్నించినా వారిని నమ్రత రెండో కుమా రుడు జయంతి కృష్ణ బెదిరించేవాడని తెలిసింది. దాంతో ఇంతకాలం ఈ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. నమ్రతపై కేసులు నమోదైనా పెద్దగా పట్టించుకోలేదు. సంపాదన కోసం తిరిగి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లను కొనసాగించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad