Sunday, July 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండా. నరేష్‌ కుమార్‌ గజ్జలకు మోస్ట్‌ పాపులర్‌ వైశ్య మేల్‌ అవార్డు

డా. నరేష్‌ కుమార్‌ గజ్జలకు మోస్ట్‌ పాపులర్‌ వైశ్య మేల్‌ అవార్డు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌
”మోస్ట్‌ పాపులర్‌ వైశ్య మేల్‌” 2025 ఏడాదికి గాను టీఎక్స్‌ హాస్పిటల్స్‌ కన్సల్టెంట్‌ న్యూరోసర్జన్‌ డా. నరేష్‌ కుమార్‌ గజ్జల అందుకున్నారు. గచ్చిబౌలిలోని ప్రధాన్‌ కన్వెన్షన్‌లో నిర్వహించిన వైశ్య లైమ్‌లైట్‌లో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. డా. నరేష్‌ న్యూరోసర్జరీ రంగంలో చేసిన విశేష సేవలు, రోగుల పట్ల ఆయన చూపిన మానవత్వం, కమ్యూనిటీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఆయన కషి ఈ అవార్డు అందుకోడానికి ప్రధాన కారణాలయ్యాయి. ఇది ఆయన చికిత్సా నైపుణ్యం, మానవీయ సేవాభావం, కమ్యూనిటీకి ఇచ్చిన విలువైన కషికి నిదర్శనంగా నిలిచింది. వైశ్య సామాజిక వర్గంలో విశిష్ట ప్రతిష్ఠ కలిగిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఎమ్మాడి ఆవిష్కరించారు. సుమధుర ఫౌండేషన్‌ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. అదేవిధంగా మణేపల్లి జ్యువెల్లర్స్‌, వాసవి కన్స్ట్రక్షన్స్‌, యెమ్మడి జ్యువెలర్స్‌ వ్యవస్థాపకులు వంటి ప్రముఖ వ్యాపారవేత్తల మద్దతునిచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -