Thursday, January 22, 2026
E-PAPER
Homeబీజినెస్డాక్టర్‌ రెడ్డీస్‌ లాభాల్లో 14 శాతం పతనం

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభాల్లో 14 శాతం పతనం

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ నికర లాభాలు 14 శాతం పతనమై రూ.1,210 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,413.3 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.8,358.6 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో 4.4 శాతం పెరిగి రూ.8,726.8 కోట్లకు చేరింది. నార్త్‌ అమెరికా అమ్మకాల్లో 12 శాతం పతనమై రూ.2,964 కోట్లుగా నమోదయ్యాయి. ఇది ఆ కంపెనీ లాభాల తగ్గుదలకు ప్రధాన కారణం. తమ వాటాదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించడం, పురోగతి, కార్యాచరణ సామర్థ్యాలపై ప్రధాన దృష్టి సారిస్తూనే ఉన్నామని ఆ కంపెనీ కో చైర్మెన్‌, ఎండీ జివి ప్రసాద్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -