Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్‌ సర్వేపల్లి

ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు డాక్టర్‌ సర్వేపల్లి

- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశంలో ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారతదేశ నిర్మాణంలో, విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీచర్లకు సకాలంలో జీతాలు రావడం లేదని వాపోయారు. రిటైర్డ్‌ టీచర్లు, ఉద్యోగులకు పెన్షన్ల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులను గౌరవించడం ప్రతిఒక్కరి ధర్మమని చెప్పారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని కోరారు. విశ్వవిద్యాలయాలకు వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటనలు గుప్పించడం కాదు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad