Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ..

కాంగ్రెస్ ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ 
నవతెలంగాణ – పరకాల 

దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి మంగళవారం పరకాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతోపాటు, వైయస్సార్ అభిమానులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బడుగు బలహీన వర్గాలకు ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను సందర్భంగా నేతలు కొనియాడారు. పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆయన వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పేదల సంక్షేమంతో పాటు కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని శక్తిగా మార్చడంలో ఆయన కృషి మరువలేనిది అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -