Monday, October 27, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా

బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా

- Advertisement -

ప్రచురించిన ఈసీఐ
న్యూఢిల్లీ :
బీహార్‌లో ముసాయిదా ఓటర్ల జాబితాను భారత ఎన్ని కల సంఘం (ఈసీఐ) శుక్రవారం ప్రచురించింది. ఈసీఐ వెబ్‌సైట్‌లో ఓటర్లు వారి పేర్లను తనిఖీ చేసుకోవచ్చు. ఈసీఐ జాబితా ప్రకారం.. జూన్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రారంభం కావడానికి ముందు బీహార్‌లో 7.93 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. అయితే నేడు విడుదలైన ముసాయిదా జాబితాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలియాల్సి వుంది. ముసాయిదా జాబితా ప్రచురణతో పాటు ‘ క్లెయిమ్‌లు .. అభ్యంతరాల’ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇది సెప్టెంబర్‌ 1 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ముసాయిదాలో పేర్లను తప్పుగా తొలగించారనే ఫిర్యాదులు ఉన్నవారు సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. ఈ ఏడాది చివరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -