నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని జనగాం గ్రామంలోని డ్రైనేజీని పునర్నిర్మాణం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయడం వల్ల డ్రైనేజీ పూర్తిగా కూలిపోయినది. డ్రైనేజీ కూలిపోవడం వల్ల మురికి నీళ్లు నిలువ ఉండి అక్కడి పరిసర ప్రాంతాల ప్రజలకు రోగాల బారిన పడుతున్నట్టు వారు తెలిపారు.
ఈ కాలనివాసులు వైరల్ ఫీవర్ వస్తున్నట్లు నవతెలంగాణకు సోమవారం తెలిపారు. ఇప్పటికైనా గ్రామ కార్యదర్శి ఈ సమస్యను అధికారులకు తెలియజేసి డ్రైనేజీని మళ్లీ నిర్మించాలని కోరుతున్నారు. ఆ డ్రైనేజీ వద్ద గణపతి ఉత్సవాలు ప్రస్తుతం నవరాత్రుల సందర్భంగా దుర్గామాత ఉత్సవాలను నిర్వహిస్తారని తెలిపారు. ఇదే ప్రాంతంలో వందల మంది రాత్రివేళ దాండియా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మించాలని కోరుతున్నారు.
డ్రైనేజీని పునర్నిర్మాణం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES