పరిష్కరించాలని అధికారులకు వినతి
నవతెలంగాణ – మిర్యాలగూడ
పట్టణంలోని ఈదులగూడ, ఏనె, రాంనగర్ బంధం కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, విధిదిపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 4 వార్డు ఈదులగూడ, ఏనే ప్రాంతాలలో పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కాలనీలో మౌళిక సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. కాలనీలో రోడ్లులన్నీ గుంతలుగా ఉన్నాయని, వర్షపు నీరు నిల్వ ఉండి, మురికి నీరు కాలనీలో రోడ్లపైనే ఉండటం వలన దోమలు, పందులు, సైర్య విహారం చేసి ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారన్నారు. విధి దీపాలు లేక అంధకారంలో మగ్గుతున్నారని చెప్పారు. వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రోడ్డు మధ్యలో స్తంభం ఉన్నవాళ్ళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దానిని తొలగించాలన్నారు.
ఈదులగూడంలో స్మశాన వాటిక ఆక్రమణకు గురవుతున్నాయని ఆక్రమణ నుంచి భూమిని కాపాడాలని కోరారు. స్మశాన వాటికకు ఫినిషింగ్ ఏర్పాటుచేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాపారావు,అచ్చయ్య, గాయం వీరారెడ్డి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.