Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతాపగిరి గ్రామంలో డ్రైనేజ్ పనులకు శ్రీకారం

ప్రతాపగిరి గ్రామంలో డ్రైనేజ్ పనులకు శ్రీకారం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామపంచాయతీలో డీఎంఎఫ్‌టి నిధుల కింద మంజూరైన రూ.8 లక్షలతో డ్రైనేజ్ నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ఊర వెంకటేశ్వరరావు కొబ్బరి కాయ కొట్టి జేసీబీ ద్వారా పనులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ డ్రైనేజ్ పనులను మాజీ ఎంపీటీసీ మహేష్ రవీందర్ రావు పర్యవేక్షణలో చేపట్టనున్నారు. ఈ సందర్భంగా డీఎంఎఫ్‌టి నిధుల మంజూరుకు సహకరించిన ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మాజీ ఎంపీటీసీ మహేష్ రవీందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బియ్యన రాజయ్య, వార్డు సభ్యులు జక్కుల మహేందర్, గుంటి చందు, గ్రామస్తులు రాజబాబు, కారోబార్ మెండ మల్లేష్‌తో పాటు పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ డ్రైనేజ్ పనులు ఎంతో ఉపయోగపడతాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -