Saturday, October 11, 2025
E-PAPER
Homeకరీంనగర్కల్వకుంట్ల కుటుంబం బాకీ కార్డుల పేరుతో డ్రామాలు

కల్వకుంట్ల కుటుంబం బాకీ కార్డుల పేరుతో డ్రామాలు

- Advertisement -

కుటుంబ కలహాలను కప్పిపుచ్చుకోవడానికే కుట్రలు
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి
నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల

బాకీ కార్డుల విడుదల పేరుతో కల్వకుంట్ల కుటుంబం డ్రామాలు ఆడుతుందని, మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని రూ.8 లక్షల 50 వేల కోట్ల అప్పులు చేసి, బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు బాకీ పడ్డదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్నామని  గమనించడంతోపాటు కుటుంబ కలహాలను కప్పిపుచ్చుకోవడానికే కెసిఆర్ కేటీఆర్ కొత్త కుట్రలు పన్నుతున్నారన్నారు.

పదేండ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయలేక రాష్ట్ర ప్రజలకు బాకీ పడిందన్నారు. 20 నెలల రేవంత్ రెడ్డి పాలనలలో దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గడపగడపకు అందుతున్నాయని తెలిపారు. కేటీఆర్ తన అనుచరులతో సిరిసిల్లలో సహజ వనరులను కొల్లగొట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. రాష్ట్రంలో దోపిడీదారులు, దగాకోరులకు స్థానం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, నాయకులు రాగుల జగన్, బైరి ప్రభాకర్, వెంగళ లక్ష్మీనర్సయ్య, వంతడుపుల రాము, నేరెళ్ల శ్రీకాంత్ రెడ్డి నాయక్ గుల్ల పెళ్లి గౌతమ్ పిస్కా మధు బొద్దుల శ్రీనివాస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -