Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeసినిమాభారీ బడ్జెట్‌తో 'ద్రౌపతి -2'

భారీ బడ్జెట్‌తో ‘ద్రౌపతి -2’

- Advertisement -

నేతాజీ ప్రొడక్షన్స్‌ తరపున చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ద్రౌపతి -2’.
ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘పళయ వన్నారపేట్టై, ద్రౌపతి, రుద్ర తాండవం, బకాసురన్‌’ వంటి విజయవ ంతమైన చిత్రాలను తెరకెక్కించిన మోహన్‌.జి ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపొందుతోంది.
రిచర్డ్‌ రిషి, రక్షణ ఇందుసుదన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నట్టి నటరాజ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇది 14వ శతాబ్దానికి చెందిన కథ. ఆ సమయంలోనే మొఘల్‌ చక్ర వర్తులు తమిళనాడులోకి ప్రవేశించారు. దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్‌, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు వీరత్వం, త్యాగం, రక్తంతో రాసిన చరిత్రకు నిదర్శనంగా నిలిచారు. రక్తంతో రాసిన చారిత్రక ఘటనల ఆధారంగా సినిమా రూపొందు తోంది. ఈ సినిమా షూటింగ్‌ 75శాతాన్ని ముంబైలో చేస్తున్నారు. మిగిలిన షూటింగ్‌ను సెంజి, తిరువణ్ణామలై, కేరళలలో చిత్రీకరించనున్నారు. ఈ చారిత్రక కథనం 2020లో విడుదలైన ‘ద్రౌపతి’ సినిమా కథతో ఎలా అనుసంధానమవుతుందో అనే విషయం ప్రధానాంశంగా నిలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad