నవతెలంగాణ – జుక్కల్ : ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పేద విద్యార్థులకు డ్రిల్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని పడంపల్లి గ్రామ ఎంపీయుపిఎస్ ప్రధాన ఉపాధ్యాయుడు లాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ఆవరణలో డ్రిల్ పిరియడ్ విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించారు. వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా రాబోయే ఆగస్టు 15వ తేదీ జెండా పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.
విద్యార్థులకు ఉత్తేజ పరచడం అహల్లాద పరిచి ప్రైవేటు విద్య కంటే ప్రభుత్వ విద్యనే మేలు అని చెప్పడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల ముగియగానే అరగంట సమయం విద్యార్థులకు అదనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇవి విద్యార్థులను ఉల్లాసంగా ఉంచడానికి దోహదపడుతుందని ఉపాధ్యాయ బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు,ఉపాధ్యాయుల బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో డ్రిల్స్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES