Saturday, October 25, 2025
E-PAPER
Homeమానవివాము నీరు..రోజూ తాగండి

వాము నీరు..రోజూ తాగండి

- Advertisement -

వాము ఆరోగ్యానికి ఎంతో మంచిది. అనేక రకాల అనారోగ్యాలను దూరం చేస్తుంది. వామును నేరుగా లేదా నీటిలో మరిగించి తీసుకోవడం మంచిది. వామును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
వాములో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్‌ వంటి మంచి లక్షణాలున్నాయి. ఇందులో ప్రోటీన్‌, కాల్షియం, ఐరన్‌, నికోటినిక్‌ యాసిడ్‌, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉన్నాయి.
రోజూ ఉదయం ఖాళీ కడుపుతో అరచెంచా వాము తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్‌, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు నొప్పి సమస్య ఉండదు.
చాలామంది పీరియడ్స్‌ సమయంలో పొత్తికడుపులో భరించలేని నొప్పిని అనుభవిస్తుంటారు. అలాంటి సమయంలో నీటిలో వామును మరగబెట్టి, చల్లారిన తర్వాత ఆ నీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతునొప్పి, గొంతులో గరగర శబ్ధాలు తగ్గుతాయి. నోటి నుండి దుర్వాసన వస్తుంటే వాము నీరు తాగితే సమస్య తగ్గుతుంది.
ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. కొద్దిగా వాము నోట్లో వేసుకొని వేడి నీటితో కలిపి నములుతూ ఉంటే చలికాలం వచ్చే జలుబు, దగ్గు తగ్గుతాయి.
బరువు తగ్గించుకోవడానికి వాము నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియలను సరిచేయడం ద్వారా ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ ఖాళీ కడుపుతో వాము నీటిని తీసుకోవాలి.
జలుబు, మైగ్రెయిన్‌ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. వామును నీళ్లలో నానబెట్టి అందులో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
వామునీరు తయారీ : ఒక చెంచా వాము గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటిని బాగా మరిగించి వడపోసి, ఖాళీ కడుపుతో తాగాలి. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -