Tuesday, January 20, 2026
E-PAPER
Homeఖమ్మంమద్యపానం హానికరం

మద్యపానం హానికరం

- Advertisement -

– మద్యం సేవించి వాహనం నడిపితే తక్షణ ప్రమాదం
– ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మద్యపానం హానికరం అయినప్పటికీ మద్యం సేవించి వాహనం నడపడం తో తక్షణ ప్రాణాపాయం పొంచి ఉంటుందని ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యయాతి రాజు పేర్కొన్నారు. తెలంగాణ డిజిపి ఆదేశాలు మేరకు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఎర్రైవ్ ఎలైవ్ ప్రచారం లో భాగంగా జిల్లా ఎస్పీ సూచన మేరకు సీఐ నాగరాజు రెడ్డి పర్యవేక్షణలో అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని ఫైర్ కాలనీ సమీపంలో వాహన దారులతో రోడ్డు ప్రమాద నివారణ అవగాహన నిర్వహించారు.వారిని ఉద్దేశించి ఎస్సై యయాతి రాజు మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్టు ప్రాముఖ్యత, మద్యం సేవించి డ్రైవింగ్,మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను గతంలో ఈ ప్రాంతంలో జరిగిన సంఘటనను ఉదహరిస్తూ వివరించి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం వాహనదారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞను “ఏమంటారు” ప్రతిజ్ఞను చేయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -