Wednesday, April 30, 2025
Homeతెలంగాణ రౌండప్నీలంతోగు గుత్తి కోయ గూడెంకు క్యాన్లతో తాగునీరు సరఫరా 

నీలంతోగు గుత్తి కోయ గూడెంకు క్యాన్లతో తాగునీరు సరఫరా 

  • ఎంపీ ఓ జాల శ్రీధర్ రావు

నవతెలంగాణ -తాడ్వాయి 

మండలంలోని బయ్యక్కపేట గ్రామపంచాయతీ పరిధిలో దట్టమైన అడవి ప్రాంతంలో గల నీలంతోగు అనే గుత్తి కోయ గూడెం నికి మంగళవారం మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు మండల పంచాయతీ అధికారి (ఎంపిఓ) జాల శ్రీధర్ రావు 36 గుత్తి కోయ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రెండు వాటర్ క్యాన్ల చొప్పున మొత్తం 72 మినరల్ వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు. వాటర్ క్యాన్లు అయిపోగానే సమాచారం అందిస్తే వెంటనే ట్రాక్టర్ ద్వారా మళ్ళీ మినరల్ వాటర్ అందిస్తామని తెలిపారు. ఎండలు తీవ్రంగా కొడుతున్న సందర్భంగా అక్కడ నీటి సమస్య తీవ్రంగా ఉండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మంచినీటి సరఫరా మంచినీటి క్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు తెలియజేశారు. మంచినీటి సమస్య తీర్చినందుకు అక్కడి గుత్తి కోయ ఆదివాసీలు మహిళలు పిల్లలు అధికారులకు, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ ఓ శ్రీధర్ రావు వెంట మేడారం పంచాయతీ కార్యదర్శి కొర్నెబెల్లి సత్తీష్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img