చిన్న, సన్నకారు రైతులు వినియోగించుకోవాలి
ఉద్యానవన శాఖ అధికారి వై మణి
నవతెలంగాణ – మల్హర్ రావు
బిందు సేద్యం, తుంపర సేద్యం కింద వందశాతం సబ్సిడీని వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ మహాదేవపూర్ డివిజన్ అధికారి వై.మణి తెలిపారు. శుక్రవారం బిందు సేద్యం తోటలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సూక్ష్మ నీటిపారుదల పథకం (టిజిఎంఐపి) 2025-26 ఆర్థిక సంవత్సరం కింద బిందు సేద్యం, తుంపర సేద్యం కోసం ప్రభుత్వం మహాదేవపూర్ డివిజన్ లోని మల్హర్, మహాదేవపూర్, మహముత్తారం, పలిమేల, కాటారం మండలాల్లోని ఎస్సి,ఎస్టీ రైతులకు 100 శాతం,జనరల్,చిన్న,సన్నకారు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 90 శాతం,(5 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం) ఉన్న రైతులకు 80 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు.
ఆసక్తి గల రైతులు టిజిఎంఐపి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రణాళిక 2025-26 ఆర్థిక సంవత్సరంలో పండ్లు,కూరగాయలు సాగు చేసే రైతులకు ప్లాస్టిక్ క్రేట్ల సరఫరా పథకం అమల్లో ఉందని ఒక ఎకరానికి 40 ప్లాస్టిక్ క్రేట్లను అందజేయడం జరుగుతుందని, 40 శాతం కూరగాయలు సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల రైతులు హార్టికల్సర్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.



