24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ నల్లకుంటలో దారుణం
నవతెలంగాణ – ముషీరాబాద్
వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన భర్తను హైదరాబాద్ నల్లకుంట పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. తూర్పు జోన్ అదనపు డీసీపీ జె. నర్సయ్య, ఏసీపీ జగన్, నల్లకుంట ఇన్‌స్పెక్టర్ మారుతి ప్రసాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, అంబేద్కర్ నగర్‌కు చెందిన కస్తాల వెంకటేశ్వర్లు (35) హైదరాబాద్‌లోని నల్లకుంట తిలక్ నగర్ ప్రాంతంలో భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. వెంకటేష్ తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని తరచూ వేధిస్తూ గొడవపడేవాడు.
దీని కారణంగా వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో నిందితుడు ఆమెపై పగ పెంచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం శివం రోడ్డులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఈ నెల 23న రాత్రి నిద్రలో ఉన్న భార్యపై పెట్రోల్ పోసి అగ్గిపెట్టెతో నిప్పు పెట్టాడు. తీవ్రంగా కాలి గాయాల పాలైన ఆమెను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 24న మృతిచెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిందితుడిని గురువారం అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్సైలు శ్రీనివాస్, డీఐ రాములు, కానిస్టేబుల్ సాయి పాల్గొన్నారు.
అనుమానంతో..భార్యకు నిప్పంటించి హత్య చేసిన భర్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



