- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని దగ్గి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ డేగుల వాడి ఏసప్ప (56 )ఆటో బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం యాచారం గ్రామస్తులను అటోలో తీసికెల్లి అక్కడ దించి తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అక్కడే పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.
- Advertisement -