– భారీగా తరలివచ్చిన నిరుద్యోగ యువత
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైడ్రాలో డ్రైవర్లుగా చేరేందుకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయానికి తరలివచ్చింది. ఔట్‌సోర్సింగ్ విధానంలో 200 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల హైడ్రా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2022-23 ఏడాదికి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో స్వల్ప మార్కులతో దూరమైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ తుది ఫలితాల నివేదిక ఆధారంగా, అందులో పేర్లున్న వారి దరఖాస్తులను మాత్రమే హైడ్రా అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే దాదాపు 850 నుంచి 900 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మరో రెండ్రోజులపాటు దరఖాస్తులను స్వీకరిస్తామని హైడ్రా కమిషనర్ ఐజీ రంగనాథ్ తెలిపారు. ఉద్యోగాలిపిస్తామని ఎవరైనా నమ్మిస్తే నమ్మొద్దని సూచించారు. నియామకాలు పారదర్శకంగా జరుగుతాయిని స్పష్టం చేశారు.
హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES