– ముషీరాబాద్‌లో డాక్టర్ జాన్‌పాల్ అరెస్ట్
– రూ.3 లక్షల మాదక ద్రవ్యాలు స్వాధీనం
నవతెలంగాణ – ముషీరాబాద్
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ వైద్యుడు ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం సాగించడం కలకలం రేపింది. తన స్నేహితులతో కలిసి డాక్టర్ జాన్‌పాల్ డ్రగ్స్ దందా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ వృత్తిలో ఉన్న జాన్‌పాల్ ముగ్గురు స్నేహితులు ప్రమోద్, శరత్, సందీప్‌తో కలిసి ముషీరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని ముషీరాబాద్‌లో ఒక ఇంటిని అద్దెకి తీసుకొని ఈ దందాకు తెరలేపాడు. పక్కా సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం ఉదయం డాక్టర్ జాన్‌పాల్ ఇంటిపై దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. డ్రగ్స్ అమ్మకాలు తన ఇంటి నుంచి చేస్తునందుకు.. డ్రగ్స్‌ను ఉచితంగా వాడుకుంటున్నట్టు పోలీసుల విచారణలో డాక్టర్ తెలిపాడు. ఈ సోదాలలో 26.95 గ్రాముల ఓజీ కుష్, 6.21 గ్రాముల ఎండీఎంఏ, 15 ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్, 1.32 గ్రాముల కోకైన్, 5.80 గ్రాముల గుమ్మాస్, 0.008 గ్రాముల ఆసీస్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు దీని విలువ రూ.3లక్షలకు పైగా ఉంటుంది. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



