కొండాపూర్‌లోని ఓ పబ్బులో ఈగల్ టీం తనిఖీలు
60 మందికి టెస్ట్ చేయగా..8మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి కుమారుడికి సైతం పాజిటివ్
నవతెలంగాణ-మియాపూర్
రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపుర్‌లోని క్వాక్ ఎరినా పబ్‌లో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈగల్ టీం తనిఖీలు నిర్వహించింది. 60 మందికి డ్రగ్స్ టెస్ట్ చేయగా.. 8మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఈగల్ టీం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌లోని ఒక పబ్బులో డ్రగ్స్ తీసుకుంటున్నారని ఈగల్ టీంకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు సదరు పబ్‌లో తనిఖీలు నిర్వహించారు. 60 మందికి టెస్టు నిర్వహించగా.. అందులో ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి కుమారుడు కూడా ఉన్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి.. అనే కోణంలో విచారణ జరుగుతుంది. పబ్‌లోనే మత్తు పదార్థాలు తీసుకున్నారా లేక బయట తీసుకుని పబ్బులోకి వచ్చారా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉందని, వీటిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈగల్ టీం సభ్యులు తెలిపారు.
డ్రగ్స్ కలకలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



