Friday, October 31, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకోట్లు విలువ చేసే డ్రగ్స్‌ కాల్చివేత

కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ కాల్చివేత

- Advertisement -

2019-2025 మధ్య రూ.4,56,43,930 విలువచేసే మత్తు పదార్థాలు స్వాధీనం
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీస్‌ అధికారులు గురువారం కాల్చేశారు. నగర సీపీ వీసీ సజ్జనార్‌ పర్యవేక్షణలో మాదకద్రవ్యాల నిర్మూలనా కమిటీ చైర్మెన్‌, డీసీపీ(డీడీ) ఎన్‌.శ్వేత నేతృత్వంలో నిషేధిత మాదకద్రవ్యాలను నాశనం చేశారు. వారి వివరాల ప్రకారం.. 2019 నుంచి 2025 మధ్య కాలంలో నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 26 పోలీస్‌ స్టేషన్‌ పరిధుల్లో ఎన్‌డీపీఎస్‌ యాక్టు ప్రకారం 128 కేసులు నమోదు చేశారు.

ఈ క్రమంలో 6.477 గ్రాముల కొకైన్‌, 1585.907 కిలోల గంజాయి. 4.6గ్రాముల ఎక్ససీ పీల్స్‌, హాష్‌ ఆయిల్‌ 4450 ఎం.ఎల్‌, ఎల్‌ఎస్‌డీ 4 బాటిళ్లు, 159.4గ్రాముల ఎండీఎంఏ, 3 నైట్రైట్‌ మాత్రలు, ఓబీసీ రెండు పేపర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4,56,43,930 ఉంటుంది. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను రంగారెడ్డి జిల్లాలోని ఏదులపల్లెలోని జీ.ఏ.మల్టీక్లేవ్‌ (ఇండియా) ప్రయి వేటు లిమిటెడ్‌ (బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హ్యాండ్లింగ్‌ సర్వీసెస్‌)లో కాల్చివేశారు. గతేడాది కూడా 326 కేసులకు సంబంధించిన రూ.10,56,64,125 మాదక ద్రవ్యాలను పోలీసులు కాల్చివేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -