Tuesday, January 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్​కమ్మర్ పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్

​కమ్మర్ పల్లిలో డ్రంక్ అండ్ డ్రైవ్

- Advertisement -

– ఇద్దరు వ్యక్తులకు 7 రోజుల రిమాండ్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు కఠిన శిక్ష విధించింది. కమ్మర్ పల్లి మండల పరిధిలో ఎస్ఐ జి.అనిల్ రెడ్డి ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అల్లం శ్రీనివాస్, పత్రి సుకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

​పోలీసులు వారిపై కేసు నమోదు చేసి, మంగళవారం ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన  1st addl JFCM కోర్టు మెజిస్ట్రేట్ పసుపులేటి భవ్యశ్రీ, నిందితులిద్దరికీ ఏడు రోజుల రిమాండ్ (జైలు శిక్ష) విధిస్తూ తీర్పునిచ్చారు.

​మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం కలగడమే కాకుండా, ఇలాంటి కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ అనిల్ రెడ్డి  స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -