Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారం శిక్షలు: సీపీ

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారం శిక్షలు: సీపీ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మద్యం మత్తులో వాహనం నడిపిన వారిపై మోటార్ వెహికల్ సవరణ చట్టం 2019 ప్రకారం పలు రకాల శిక్షలు పడతాయని వాహనదారులు పోలీస్ శాఖ నియమ నిబంధనలను పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మోటర్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం సెక్షన్ 185 క్రింద డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారు శిక్షర్హులు మొదటి సారి డ్రంకెన్ డ్రైవ్ లో పట్టు బడినట్లయితే 2,000/- రూపాయలు లేదా 6 నెలల వరకు జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందన్నారు. మొదటి సారి పట్టు బడిన తరువాత 3 సంవత్సరాల వ్యవధిలో మళ్ళీ పట్టు బడినట్లయితే 3,000/- జరిమానా లేదా 6 నెలల జైలు లేదా జరిమానాతో పాటు జైలు ఉంటుందని తెలిపారు.

ఇక నుండి నిజామాబాద్ జిల్లాలో మోటర్ వెహికల్ ఆమెండ్మెంట్ యాక్ట్ 2019 అమలు చేసినట్లు తెలిపారు. మోటర్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం డ్రంకెన్ డ్రైవ్లో పట్టు బడిన వారికి కోర్ట్ లో మొదటి సారి పట్టుబడిన వారికి 10,000/- రూపాయలు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష పడుతుందని తెలిపారు.డ్రంకెన్ డ్రైవ్లో రెండో సారి పట్టు బడిన వారికి 15,000/- రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించబడును అని తెలియజేశారు. జరిమానా జైలు శిక్షలతోపాటు ఇతర చర్యలు సైతం రానున్న రోజులో తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు లేదా సస్పెండ్ చేయవచ్చు. తాగి రోడ్ ప్రమాదం చేసి ఎదుటి వారు మరణిస్తే ఐపిసి సెక్షన్ 105 బి.ఎన్ ఎస్ ( 304 /2) కింద కేసు నమోదు చేయబడును ఇట్టి సెక్షన్ ప్రకారం 10 సంవత్సరాలు వరకు జైలు లేదా జరిమానా లేదా జరిమానాతో పాటు జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు

.తాగి నడిపి ప్రమాదం చేసి ఎదుటివారు గాయలకు గురైతే సెకండ్ 110 బి.ఎన్.ఎస్ (308 ఐపీసీ) కింద కేసు నమోదు చేయబడును ఇట్టి సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు లేదా జరిమానా లేదా జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా విందించబడును. పోలీస్ బ్రీత్ అనలైజర్ ద్వారా పరీక్షించవచ్చు. పరీక్ష నిరాకరించినా కూడా అదే సెక్షన్ కింద శిక్షించవచ్చు. కావున కావున ప్రతి వాహనాదారుడు రోడ్డు భద్రత నియమాలు తూచా తప్పకుండా పాటించాలని  నిజాంబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -