– నిర్లక్ష్యంగా కారు నడుపుతూ ఇద్దరికి ఢ
– అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బానెట్‌పై ఈడ్చుకెళ్లిన వైనం
– గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-మియాపూర్
మద్యం మత్తులో యువకుడు కారుతో ఇద్దరిని ఢకొీట్టి హల్‌చల్ చేసిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన విషయం తెలిసిందే. మద్యంమత్తులో మితిమీరిన వేగంతో వెనుక నుంచి ఒక వాహనాన్ని ఢకొీట్టడమే కాకుండా అడ్డుకోబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన కలకలం రేపింది. సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 07 ఈఎక్స్ 5556 బెంజ్ కార్ నార్సింగి నుంచి కూకట్‌పల్లికి వెళుతూ.. ఓ వాహనాన్ని ఢ కొట్టింది. వాహనదారుడు కనకరాజుకు గాయాలయ్యాయి. ఈ సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించారు. దాంతో కానిస్టేబుల్‌ను సైతం ఢకొీట్టడంతో బానెట్‌పై పడిపోయినా వాహనాన్ని అతివేగంగా నడిపాడు. చివరకు ఇతర వాహనదారులు అడ్డుకోవడంతో కారు ఆగింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయగా 160 పాయింట్లు వచ్చింది. దాంతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, నిందితుడు నార్సింగికి చెందిన 24 ఏండ్ల విద్యార్థి గుర్రంపాటి తరుణ్‌గా గుర్తించారు.
మద్యం మత్తులో హల్‌చల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



