నవతెలంగాణ – వీర్నపల్లి
భూగర్భజాలాలు ఎండిపోవడంతో బోర్లు, బావుల్లో నీరు అడుగం టిపోతున్నాయి. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన తౌట్ రాజు 1 ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమిలో ఎకరం వరిపంట వేశాడు. ఈ ఏడాది వేసిన బోరు పై ఆధారపడి వరి పంట సాగు చేశారు. బోరు బావి నీరు సరిపోకపోవడంతో పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీళ్లు తీసుకువచ్చి పొలానికి పెడుతున్నాడు.
ఒక్కో ట్యాంకర్కు 500 రూపాయలు వెచ్చించాల్సి వస్తుందని, పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల నీరు పోసిన సరిపోతలేవన్నారు. పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడాల్సివస్తుందని, పరిస్థితి ఇలానే ఉంటే చాలా మంది రైతుల పొలాలు ఎండిపోతాయి. ఎత్తిపోతల పథకం ద్వారా చేపట్టిన పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి చెరువులను నీటితో నింపి సాగు నీరు అందించాలని కోరారు అలాగే పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరారు.



