రాష్ట్రంలో మిగులు ఉపాధ్యాయులు 21,140 మంది
7,364 సర్కారు బడుల్లో
15,611 మంది టీచర్ల కొరత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పట్లో రావడం కష్టమేనని తెలుస్తున్నది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని చూస్తే టీచర్ల సంఖ్య అధికంగా ఉన్నట్టు గణాంకాలున్నాయి. దీంతో ఉపాధ్యాయ నియామకాల పట్ల ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తున్నది. రాష్ట్రంలో విద్యార్థుల నిష్పత్తితో చూస్తే ఉపాధ్యాయుల సంఖ్య ఇప్పటికే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. దీంతో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేది కష్టమేనని తెలుస్తున్నది. ఇది ఉపాధ్యాయ అభ్యర్థులకు నిరాశ కలిగించే అంశం. అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలున్నాయి. ప్రతినెలా ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నారు. ఇటీవల 3,844 మంది ఉపాధ్యాయులకు పదోన్న తులను ఇచ్చింది. ఇలా ఉపాధ్యాయ ఖాళీలు సుమారు పది వేల వరకు ఉంటాయని తెలుస్తున్నది. ఖాళీలున్నప్పటికీ విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని గమనిస్తే ఎక్కువ మంది టీచర్లు పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. అంటే ఉపాధ్యాయ ఖాళీలున్నా భర్తీ చేయ కుండా అవసరం ఉన్న చోటకి సర్దుబాటు చేస్తున్నారు. రాష్ట్రంలో 12,994 ప్రభుత్వ పాఠశాలల్లో మిగులు ఉపాధ్యా యులు 21,140 మంది ఉన్నారు. అయితే 7,364 బడుల్లో 15,611 మంది ఉపాధ్యా యుల కొరత కూడా ఉన్నట్టు పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. రాష్ట్రంలో 24,227 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 25 ప్రకారం రాష్ట్రంలో 99,076 మంది ఉపాధ్యాయులే అవసరం. అయితే రాష్ట్రంలో 1,04,605 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అంటే అదనంగా 5,529 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ గుర్తిం చింది. రాష్ట్రంలో 16,448 ప్రాథమిక పాఠశా లలున్నాయి. వాటిలో 40,571 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 9,221 బడుల్లో 11,232 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్టు గుర్తించింది. అయితే 2,009 పాఠశాలల్లో 2,528 ఉపాధ్యాయుల కొరత ఉందని గణాంకాల్లో ప్రకటించింది. రాష్ట్రంలో 3,102 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 12,823 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 1,519 బడుల్లో 2,144 మంది ఉపాధ్యాయులు అదనంగా పనిచే స్తున్నట్టు గుర్తించింది. అయితే 2,399 పాఠశా లల్లో 7,091 మంది ఉపాధ్యాయుల లోటు ఉందని తెలిపింది. ఇక 4,677 ఉన్నత పాఠశా లల్లో 51,211 మంది ఉపాధ్యాయులు పనిచే స్తున్నారు. 2,254 బడుల్లో 7,764 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించింది. అయితే 2,956 పాఠశాలల్లో 5,992 ఉపాధ్యాయుల కొరత ఉందని వివరించింది.
డీఎస్సీ కష్టమే…!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES