Monday, March 2, 2026
E-PAPER
Homeసినిమా'పెద్ది' డబ్బింగ్‌ మొదలైంది

‘పెద్ది’ డబ్బింగ్‌ మొదలైంది

- Advertisement -

హీరో రామ్‌చరణ్‌ నటిస్తున్న పాన్‌-ఇండియా ప్రాజెక్ట్‌ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్‌ బ్యానర్‌ పై వెంకట సతీష్‌ కిలారు భారీగా నిర్మిస్తున్నారు.
సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరిచిన ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌, బ్లాక్‌ బస్టర్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘చికిరి చికిరి’ ట్రెమండస్‌ రెస్పాన్స్‌తో రికార్డులను బద్దలు కొట్టాయి. తాజాగా రామ్‌ చరణ్‌ డబ్బింగ్‌ ప్రారంభించారు. పెద్ది పాత్రలో చరణ్‌ చెప్పిన ‘ఏమది’ డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది.

వీడియోలో ”బుచ్చి.. చికిరి పాటలో మోహిత్‌ చౌహాన్‌ వాయిస్‌కి నువ్వు ఎంత యాక్టింగ్‌ చేశావంటే.. నువ్వు పాడావా ఆయన పాడాడా? అనే డౌట్‌ వచ్చిందయ్యా.. నాకు డబ్బింగ్‌లో కూడా అలా యాక్టింగ్‌ చేయమని చెప్పకు. డబ్బింగ్‌ నేనే చెప్పానండి’ అని బుచ్చిబాబుతో చరణ్‌ చెప్పడం నవ్వులు పూయించింది. ఈ వీడియో ప్రస్తుతం షోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇందులోని సెకండ్‌ సింగిల్‌ ‘రై రై రారా’ నేడు రిలీజ్‌ కాబోతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్‌ కుమార్‌, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -