నవతెలంగాణ – కాటారం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సోదరుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు జన్మదినం సందర్భంగా జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 27వ సారి రక్తదానం చేసి మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు. హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో స్పందించిన విక్రమ్ స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాలుగా దుద్దిళ్ళ కుటుంబం మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందిస్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. రక్తదానం మహత్తర సేవ అని, ప్రతి యువకుడు సమాజానికి ఉపయోగపడేలా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విక్రమ్‌ను అభినందించారు.



