Sunday, May 11, 2025
Homeసినిమాదీపావళి కానుకగా 'డ్యూడ్‌' రిలీజ్‌

దీపావళి కానుకగా ‘డ్యూడ్‌’ రిలీజ్‌

- Advertisement -

‘లవ్‌ టుడే’, ‘రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌’ చిత్రాలతో ప్రదీప్‌ రంగనాథన్‌ తమిళంతోపాటు తెలుగులోనూ మంచి ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌ తమిళం-తెలుగు ద్విభాషా ప్రాజెక్టు చేస్తోంది. కీర్తిశ్వరన్‌ ఈ చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. ‘ప్రేమలు’ చిత్రంతో అందరినీ అలరించిన మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్‌ నటుడు శరత్‌ కుమార్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా విడుదల చేశారు. అలాగే విడుదల తేదీకి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. యూత్‌ని ఆకట్టుకునే విధంగా ‘డ్యూడ్‌’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో ప్రదీప్‌ రంగనాథన్‌ ఇంటెన్స్‌ లుక్‌ అందర్నీ అలరిస్తోంది. మోడరన్‌ ట్విస్ట్‌తో కూడిన పూర్తి ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్‌ ఈ ప్రాజెక్ట్‌ కోసం ట్యాలెంటెడ్‌ టెక్నిషియన్స్‌ని ఎంపిక చేసింది. ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా, నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లతా నాయుడు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా, భరత్‌ విక్రమన్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -