- Advertisement -
నవతెలంగాణ – ఊరుకొండ : మూగజీవాలైన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మరియు పందులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని.. దీంతో మూగజీవాలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఊరుకొండ మండల పశువైద్యాధికారి రాజేష్ కుమార్ అన్నారు. శనివారం ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని తిమ్మన్నపల్లి గ్రామంలో గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -