నవతెలంగాణ మిర్యాలగూడ
త్వరలో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కరిస్తానని ఎంఎల్ఏ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఈదులగూడెం శివారులో ఉన్న డంపింగ్ యార్డును సందర్శించారు. డంపింగ్ యార్డ్ గత కొన్ని సంవత్సరాలుగా చెత్త పేరుకొని పోయి, దాని ద్వారా చుట్టూ పక్కన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు, డంపింగ్ యార్డ్ లోని చెత్తను రీసైకిల్ చేసి చెత్తను అక్కడి నుంచి తొలగించేందుకు ప్రైవేట్ కంపెనీ వారితో చర్చించినట్లు తెలిపారు. త్వరలో ఇక్కడ నుంచి చెత్తను తొలగించి పట్టణ ప్రజలకు, చుట్టూ పక్కన గ్రామాల ప్రజలకు డంపింగ్ యార్డు సమస్యని పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి. మున్సిపల్ డి ఈ వెంకన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ,పర్యావరణ ఇంజనీర్ శ్వేత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం: ఎమ్మెల్యే బీఎల్ఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


