- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని అంగన్వాడీలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే విషయమైన అంగన్వాడీల యూనియన్ ప్రతినిధులు నిన్న మంత్రి సీతక్కను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆమె ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే సెలవుల్లోనూ గర్భిణులు, బాలింతలు, పిల్లల ఇంటికే పౌష్టికాహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
- Advertisement -