Saturday, December 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేటి నుంచి జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు

నేటి నుంచి జూనియర్‌ కాలేజీలకు దసరా సెలవులు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేట్‌, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలకు శనివారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం జూనియర్‌ కాలేజీలకు ఆదివారం నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ భారీ వర్షాలు, ఇతర కారణాల నేపథ్యంలో జూనియర్‌ కాలేజీలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించామని కార్యదర్శి తెలిపారు. శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలకు యాజమాన్యాలు దసరా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సెలవులు వచ్చేనెల ఐదో తేదీ వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఆరో తేదీన జూనియర్‌ కాలేజీల్లో తరగతులు పున ప్రారంభం అవుతాయని తెలిపారు. ఈ సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే ఆ కాలేజీ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే అవసరమైతే కాలేజీల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -