Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం21 నుంచి బడులకు దసరా సెలవులు

21 నుంచి బడులకు దసరా సెలవులు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈనెల 21 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. వచ్చేనెల మూడో తేదీ వరకు సెలవులుంటాయని అకడమిక్‌ క్యాలెండర్‌లోనే స్పష్టం చేసింది. పాఠశాలలకు 13 రోజులపాటు సెలవులుంటాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీలకు ఈనెల 28 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు దసరా సెలవులుంటాయి. జూనియర్‌ కాలేజీలకు ఎనిమిది రోజులపాటు ఇంటర్‌ బోర్డు సెలవులను ప్రకటించింది. వచ్చేనెల నాలుగో తేదీన పాఠశాలలు, ఆరో తేదీన జూనియర్‌ కాలేజీలు తెరుచుకుంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -