గాంధీ జయంతి రోజే పండుగ
మద్యం, మాంసం దుకాణాలు బంద్
నవతెలంగాణ–మల్హర్ రావు
దసరా అంటేనే సందడి ఉంటుంది.వివిధ ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినవారు స్వ గ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో సంబురాలు చేసుకుంటారు. మద్యం, మాంసం లేని దసరాను ఊహించుకోలేం. ఈ సారి దసరా గాంధీ జయంతి రోజు రావడం అక్టోబర్ 2న మద్యం,మాసం దుకాణాల బంద్ నేపథ్యంలో ముందుగానే కొనుగోలు చేసిపెట్టుకుంటున్నారు.
కొంత మంది దసరా ముందు రోజు లేదా తర్వాత రోజే పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. గత వారం రోజుల నుంచే వైన్స్ దుకాణాల్లో పెద్ద ఎత్తున స్టాక్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.మండలంలో కొయ్యుర్, తాడిచెర్లలో రెండు వైన్స్ దుకాణాలు ఉన్నాయి.వైన్స్ లకు దసరా పండక్కి పెద్దఎత్తున గిరాకీ ఉంటుంది. గాంధీ జయంతి కావడంతో గిరాకీ తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి లక్షల్లో అమ్మకాలు జరుగుతాయని అంచనా.