విధులకు రాకపోయినా అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు.?
నవతెలంగాణ – అచ్చంపేట
(పురపాలక పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ) అచ్చంపేట మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక, పారిశుధ్యం, నీటీ సరఫరా, ఆస్తిపన్ను వసూలు, లైసెన్స్ లు జారీ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, హెల్త్ వివిధ విభాగంలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటారు. అచ్చంపేట మున్సిపాలిటీ లో కొన్ని విభాగాల ఉద్యోగులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని ఆరోపణలు బహిర్గతంగా వినిపిస్తున్నాయి. ఒకటి రెండు రోజులు విధులకు రాకపోయినా మరుసటి రోజు వచ్చి ఆటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది.
ప్రధానంగా ఇంజనీరింగ్ భాగంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు ఆటెండెన్స్ రిజిస్టర్ లో విధులకు రాని రోజులు సంతకాలు పెట్టుకుంటున్నారని కార్యాలయంలో చర్చ జరుగుతుంది. గత నెల 24, 25, 26 తేదిలలో ఏఈ విధులకు రాలేదని, కానీ రిజిస్టర్ లో సంతకాలు చేశారని తెలుస్తుంది. టౌన్ ప్లానింగ్ అధికారి విధులకు రాని రోజు తర్వాత రోజు వచ్చి సంతకాలు చేసుకుంటున్నారని ఆఫీసులోనే ప్రచారం జరుగుతుంది.
ఉద్యోగుల పనితీరు విధానంపై మున్సిపల్ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ నిర్వహణపైన చైర్మన్, కమిషనర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా విధులకు రాని రోజులలో కూడా వచ్చినట్లు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మునిసిపాలిటీలో వివిధ విభాగాల విధులు
మున్సిపాలిటీ స్థాయిని బట్టి కొన్ని సెక్షన్ అధికారులు అధికంగా కేటాయించడం జరుగుతుంది. పరిపాలన విభాగంలో ఆఫీసు నిర్వహణ సిబ్బంది పరి తీరు జనరల్ గా ఉంటుంది. రెవెన్యూ విభాగంలో ప్రధానంగా ఆస్తి పన్ను నీటి పన్ను ఇతర కొన్ని రకాల పనులు వసూలు చేయవలసి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ నూతన ఇంటి నిర్మాణ అనుమతులు, ప్రభుత్వ స్థలాలు, రోడ్డులు ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇంజనీరింగ్ విభాగంలో వీధి దీపాల నిర్వహణ డ్రైనేజీ నిర్మాణా వ్యవస్థ రోడ్ల నిర్మాణ వ్యవస్థ పర్యవేక్షణ చేయవలసి ఉంటుంది. హెల్త్ విభాగంలో ప్రధానంగా చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటారు. అకౌంట్ సెక్షన్ విభాగంలో సిబ్బంది వేతనాల చెల్లింపు, బడ్జెట్ అంచనా రూపకల్పన ఆఫీసు నిర్వహణలో భాగంగా కొన్ని లెక్కల విభాగం సర్దుబాటు చేయడం జరుగుతుంది.



