– ఆప్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పత్తి దిగుమతిపై సుంకం మినహాయింపు తగదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు మినహాయింపు పొడిగించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న గుజరాత్ లో జరిగే పత్తిరైతుల సభకు తెలంగాణ రైతులు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నేతలు బుర్ర రాము గౌడ్, విజరు మల్లంగి, హేమ జిల్లోజు, శివాజీ, దర్శనం రమేష్, రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.
పత్తి దిగుమతిపై సుంకం మినహాయింపు తగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES