Thursday, March 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉద్యోగాల నోటిఫికెషన్స్ కోసం డివైఎఫ్ఐ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

ఉద్యోగాల నోటిఫికెషన్స్ కోసం డివైఎఫ్ఐ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

- Advertisement -



– అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న హామీ ఏమైంది?
– అసెంబ్లీ గేటు దగ్గర డివైఎఫ్ఐ నాయకత్వంపై పోలీసుల దాడులు
– ప్రజా పాలన పేరుతో నిర్బంధాల పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
– రాష్ట్రవ్యాప్తంగా డివైఎఫ్ఐ నాయకత్వం అక్రమ అరెస్టులు
– పోలీసుల దాడులను, అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దిష్టిబొమ్మల దగ్ధంకు పిలుపు
– డివైఎఫ్ఐ

నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకై ఈ అసెంబ్లీ లో నోటిఫికెషన్స్ విడుదల చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని,యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని, జాబ్ క్యాలెండరు అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఈరోజు డివైఎఫ్ఐ, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ విజయవంతం అయింది.పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న అర్ధరాత్రి నుండి అన్ని జిల్లాల్లో ముందస్తు అక్రమ అరెస్ట్లు చేసినా కుడా డివైఎఫ్ఐ నాయకత్వం అసెంబ్లీ ని ముట్టడించడం జరిగింది.
ఈ సందర్బంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలండర్,నిరుద్యోగ భృతి ,యూత్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని హమీలు‌ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 29 నెలలు అవుతున్నా ఇప్పటికి హామీలు అమలు చేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్లో నైనా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంతవరకు ప్రతి నిరుద్యోగికి 4వేల రూపాయల నిరుద్యోగ భృతి కి నిధులు కేటాయిస్తారేమోనని ఆశలు పెట్టుకున్నారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా కూడా ఎన్నికల్లో ప్రధాన డిమాండ్ గా ఉన్న నిరుద్యోగ భృతి పదమే ఊసేత్తకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. గత బడ్జెట్లో ప్రకటించిన జాబ్ క్యాలండర్ గురించి ప్రస్తావించకపోవడం జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ ను అమలు చేయకపోవడం,ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్స్ వేయకుండా నిరుద్యోగ యువతన నిర్లక్ష్యం చేస్తుందన్నారు.ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు 67వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసి గొప్పలు చెప్పుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నా నోటిఫికెషన్స్ వేయకుండా నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు.


రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధి రుణాలకై రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్నా అమలు చేయడం లేదని అన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలకై రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగ రేటును దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు

కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. నిరుద్యోగ యువత నోటిఫికెషన్స్ లేకపోవడంతో తీవ్రమైన ఆవేదనతో ఉన్నారని తక్షణమే ఉద్యోగాల భర్తీకై నోటిఫికెషన్స్ వేయాలని, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలని,యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ముండ్ల కంచెలు ఉండవు,నిర్బంధాలు ఉండవని చెప్పి ప్రజా పాలన పేరుతో నిర్బంధాల పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ జేఏసీ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించి అసెంబ్లీకి బయలుదేరుతున్న తరుణంలో నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.ఎల్.మూర్తితో పాటు నాయకులను అరెస్టు చేసి ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.


రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో అర్ద్ర రాత్రి నుండే ముందస్తు అరెస్టులు చేసినా కుడా ప్రభుత్వం నిర్బంధాలను ఛేదించుకొని అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తక్షణమే ఉద్యోగాలభర్తికై నోటిఫికేషన్లు వేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


అసెంబ్లీ దగ్గర అరెస్టులు చేసే సందర్భంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, నాయకులు రాజులు పోలీసుల దాడిలో గాయపడ్డారు. పోలీసుల అక్రమ అరెస్ట్ లను,దాడులను నిరసిస్తూ రేపు,ఎల్లుండి రెండు రోజులపాటు ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ దగ్గర అరెస్టు చేసి ఆఫ్జల్ గంజ్, నాంపల్లి పోలీస్ స్టేషన్లో తరలించారు.అరెస్ట్ చేసిన వారందరిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జావీద్, గడ్డం వెంకటేష్, మల్లం మహేష్, కృష్ణ నాయక్, జగన్ రాష్ట్ర నాయకులు మధు, ప్రశాంత్, శ్రీనివాస్, భాను ప్రసాద్, వనం రాజు, చైతన్య, రాజయ్య, శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.











- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -