నవతెలంగాణ – కంఠేశ్వర్
జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య పిలుపుమేరక శుక్రవారం రాష్ట్ర బంద్ పిలుపు ఇవ్వడంతో నిజాంబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్, నాయకులు శ్రీను ని ముందస్తు అరెస్ట్లు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఉద్యమకారులను ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటని అన్నారు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు.
అయినప్పటికీ ఈ ప్రభుత్వం బిసి ఉద్యమకారులను అరెస్టులతోని ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. మేము ఏదైతే బీసీల కొరకై జీవో నెంబర్ 9 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి బీసీ కులగరణ చేపట్టి సర్వే ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు. జీవో ఇచ్చినప్పటికీ కావాలనే రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి జాగృతి పేరుతోనే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసు వేయడం నోటికి వచ్చిన అన్నాన్ని లాక్ ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది అయినప్పటికీ బీసీలు అంటేనే నేటి ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం భయపడతా ఉందని అన్నారు. ఎక్కడ వీళ్లు ఎమ్మెల్యేలు మినిస్టర్లు రాజ్యాధికారం చేపడతారని అన్ని విధాలుగా బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అయినా రాబోయే కాలం బీసీలదే బీసీ లందరూ కూడా ఐక్యమత్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నామని అన్నారు.
నగరంలో ముందస్తు అరెస్టులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES