- Advertisement -
నవతెలంగాణ – తొగుట
విద్యార్థులకు పండుగ విశిష్టతను తెలియజేయడం కోసం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించాని ప్రధానోపాధ్యాయులు పుల్లగుర్ల రామచంద్రారెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని మెట్టు ప్రాథమిక పాఠశాల ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ .. విద్యార్థులకు పండుగ విశిష్టతను తెలిపారు. అలాగే సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారి తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం సరస్వతి, దీపిక, అఖిల, అంగన్వాడి టీచర్ మరియా మేరీ, ఆయా రజియా తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -